News October 22, 2024
AMC చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి ఎంపిక
AMC చైర్మన్ గా మండలంలోని పిడూరు పాలెం గ్రామానికి చెందిన గాలి రామకృష్ణ రెడ్డి ఎంపికైనట్లు ఆ పార్టీ నాయకులు సోమవారం రాత్రి తెలిపారు. గాలి రామకృష్ణారెడ్డి గత 30 సంవత్సరాలుగా టీడీపీ మండల అధ్యక్షుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయన చేసిన సేవలకు గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏఎంసీ ఛైర్మన్‌గా నియమించారు. దీనితో పలువురు ఆయనను అభినందించారు.
Similar News
News November 6, 2024
నెల్లూరు: ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఆయనను ఎస్కార్ట్ పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడికి, ఆయన భార్యకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. SP ఎస్కార్ట్ పోలీసులను సస్పెండ్ చేశారు.
News November 6, 2024
నెల్లూరు: RTCలో 13 నుంచి ఇంటర్వ్యూలు
RTCలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ వి. శ్రీధర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 13వ తేదీ, నెల్లూరుకు 14వ తేదీ, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు 15వ తేదీ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
News November 6, 2024
నెల్లూరులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఓ ఆటో డ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పొక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.