News May 13, 2024
అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఖాళీ..

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగతో హైదరాబాద్ ఖాళీ అయింది. నిత్యం విపరీతమైన రద్దీ ఉండే అమీర్‌పేట మెట్రో స్టేషన్ వెలవెలబోతోంది. సాధారణ రోజుల్లో అక్కడ కాలు పెట్టేందుకు కూడా వీలుండదు. ఈ ఉదయం మాత్రం పూర్తిగా ఖాళీగా కనిపించింది.
Similar News
News February 1, 2026
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 252 రన్స్ చేయగా, పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే, ఖిలాన్ చెరో 3 వికెట్లు, అంబరీశ్, హెనిల్, చౌహాన్, విహాన్ తలో వికెట్ చేశారు. ఈ గెలుపుతో ఆయుశ్ సేన జైత్ర యాత్రను కొనసాగిస్తూ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
News February 1, 2026
పార్టీ ఫండ్ నుంచి ఆ పరికరాలు కొన్నారా: KCRను ప్రశ్నించిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ పలు ప్రశ్నలు వేస్తూ KCRను విచారించినట్లు సమాచారం. ‘ప్రభాకర్ రావు సర్వీసును ఎందుకు పొడిగించారు? ఆయనకే 2 పోస్టులెందుకు ఇచ్చారు? ట్యాపింగ్ పరికరాలకు పార్టీ నిధులు వాడారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. BRSకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది.
News February 1, 2026
చంద్రబాబు హింసా జ్వాలను రాజేస్తున్నారు: జగన్

AP: మాజీ మంత్రి జోగి రమేష్‌తో YCP చీఫ్ వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పరామర్శించారు. ‘ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చంద్రబాబు హింసా జ్వాలను రాజేస్తున్నారు. అవే మంటలు CBN ప్రభుత్వాన్ని దహించి వేయక తప్పదు’ అని హెచ్చరించారు. భయపడొద్దని, పార్టీ మొత్తం అండగా ఉంటుందని జోగి రమేశ్‌కు భరోసా ఇచ్చారు.


