News February 27, 2025

EAPCET ప్రవేశాల్లో సవరణలు

image

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <>సవరణలు <<>>చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించనుంది. 15% అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు 4 రకాలుగా అర్హులను గుర్తించింది. తెలంగాణ స్థానికులు, TGలో పదేళ్లు చదివిన ఇతర రాష్ట్రాల వారు, కేంద్ర-రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, కేంద్ర-రాష్ట్ర ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ 15% సీట్లకూ అర్హులని పేర్కొంది.

Similar News

News November 28, 2025

తులసి ఆకులను నమలకూడదా?

image

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.

News November 28, 2025

ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

image

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్‌కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.

News November 28, 2025

మట్టి పాత్రలు ఎలా వాడాలంటే?

image

ప్రస్తుతం చాలామంది మట్టిపాత్రలు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. కొత్త మట్టిపాత్రను వాడేముందు సీజనింగ్ చేయాలి. రోజంతా నీళ్లలో నానబెట్టి ఆరాక పూర్తిగా నూనె రాసి ఆరనివ్వాలి. కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ వెళ్లాలి. వీటిలో ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వాడాలి.