News March 11, 2025

ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

image

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్‌డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News October 24, 2025

నేడు..

image

* ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్‌లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్‌డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక

News October 24, 2025

ఇంటర్వ్యూతో NIRDPRలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.50వేలు చెల్లిస్తారు. http://career.nirdpr.in

News October 24, 2025

గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదా?

image

గరుడ పురాణంలో నరకం, పాపుల శిక్షల గురించి నిక్షిప్తంగా ఉంటుంది. ఇందులో ‘ప్రేతకల్పం’ ఉండటం వలన దీనిని ఇంట్లో చదవవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ పురాణాన్ని మిగిలిన పురాణాల మాదిరిగానే ఇంట్లో చదువొచ్చని పండితులు చెబుతున్నారు. ఇందులోని జ్ఞానం మనిషిని సత్కర్మల వైపు నడిపిస్తుందని అంటున్నారు. ఇతరులకు బహూకరించేటప్పుడు దీనిని హంస ప్రతిమతో ఇవ్వడం శుభప్రదమని సూచిస్తున్నారు.<<-se>>#DHARMASANDEHALU<<>>