News November 5, 2024
అమెరికా ఎన్నికలు.. ఆసక్తికర విషయాలు
* ప్రతిసారి నవంబర్ తొలి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి
* మొత్తం ఓటర్లు 24.4 కోట్లు
* ఎర్లీ ఓటింగ్లో ఇప్పటికే ఓటు వేసినవారు 7.5 కోట్లు
* ఇంగ్లిష్, చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్ పేపర్
* భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభం
* 2025 జనవరి 20న కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
Similar News
News December 27, 2024
డైరెక్టర్ కన్నుమూత
తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.
News December 27, 2024
నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.
News December 27, 2024
చిల్డ్రన్స్ డేకి DEC 26 సరైన రోజు: కిషన్ రెడ్డి
TG: బాలల దినోత్సవాన్ని NOV 14న నిర్వహించడం సరి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 26న నిర్వహించాలన్నారు. ప్రధాని సూచనలతో DEC 26ను వీర్ బాల్ దివస్గా ప్రతి పాఠశాలలో నిర్వహించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. వీర్ బాల్ దివస్ను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.