News November 6, 2024
అమెరికా ఎన్నికలు.. ఆధిక్యంలో ఎవరంటే?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు Real Clear Polling సైట్ తెలిపింది. పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ 211 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, పెన్సిల్వేనియా, విస్కన్సిన్, ఆరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాల్లోని 108 ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
Similar News
News February 14, 2026
పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
News February 14, 2026
ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.
News February 14, 2026
ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.


