News November 12, 2024

అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్

image

ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్‌ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్‌తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.

Similar News

News December 27, 2024

భారత్‌పై స్మిత్ రికార్డు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.

News December 27, 2024

మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ

image

మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్‌ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

News December 27, 2024

10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు

image

తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.