News May 21, 2024

ఇబ్రహీం రైసీపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సంతాప ప్రకటనలో అమెరికా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. రైసీ చేతులు రక్తంతో తడిచాయంటూ పరోక్షంగా అనేక హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉందని ఆరోపించింది. ‘ఇరాన్‌లో హక్కుల అణచివేతలో ఆయన పాత్ర ఉంది. హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలను వెనకేసుకొచ్చారు’ అని పేర్కొంది. అటు సాధారణంగా ఎవరు మరణించినా తాము సంతాపం తెలుపుతామని, అలాగే రైసీ మృతికీ సంతాపం తెలుపుతున్నాం’ అని USA పేర్కొంది.

Similar News

News January 11, 2025

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వచ్చి పుష్కరమైంది

image

పండుగొచ్చిందంటే చాలు టీవీల్లో శ్రీకాంత్ అడ్డాల తీసిన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, పల్లెటూరి అందాలను ఎంతో చక్కగా చూపించారు.

News January 11, 2025

రైతు భరోసా ఎకరానికి రూ.17,500 ఇవ్వాల్సిందే: BRS

image

TG: రైతు భరోసా పథకంలో 70% మంది రైతులకు కోత పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లీకులు ఇచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. తాము పోరాటం చేయడంతోనే ఇప్పుడు వెనక్కి తగ్గి సాగు భూములన్నింటికీ ఇస్తామంటోందని పేర్కొంది. ‘2023 యాసంగికి రూ.2,500, 2024 వానాకాలానికి రూ.7,500, 2024 యాసంగికి రూ.7,500 ప్రభుత్వం రైతులకు బాకీ పడింది. ఎకరానికి రూ.17,500 ఇచ్చే వరకూ రైతుల పక్షాన పోరాడతాం’ అని తెలిపింది.

News January 11, 2025

ప్రభాస్ పెళ్లిపై చెర్రీ హింట్.. అమ్మాయిది ఎక్కడంటే?

image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అన్‌స్టాపబుల్’ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై చరణ్ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.