News March 14, 2025
గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
Similar News
News March 15, 2025
కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ విజయం సాధించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ కార్నీకి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి.
News March 14, 2025
తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి: పవన్ కళ్యాణ్

AP: హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా?’ అని పవన్ ప్రశ్నించారు.
News March 14, 2025
‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.