News September 30, 2024
ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటర్

PM మోదీని గద్దెదించే వరకు తాను చావబోనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధాని పట్ల కాంగ్రెస్, ఆ పార్టీ నేతలకు ఉన్న ద్వేషం, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఖర్గే అనవసరంగా మోదీని ఆయన వ్యక్తిగత, ఆరోగ్య విషయాల్లోకి లాగారని పేర్కొన్నారు. ఈ తరహా వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్‌లో ఖర్గే అందర్నీ మించిపోయారన్నారు.
Similar News
News November 22, 2025
వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్‌లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.


