News December 12, 2024

అర్ధరాత్రి అమిత్ షా, ఫడ్నవీస్ భేటీ

image

కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. CM పదవి ఇవ్వలేదని అలకబూనిన శిండే Dy.CMగా ఉండేందుకు ఇంకా అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆయనను ఒప్పించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Similar News

News October 22, 2025

NMLలో 21 పోస్టులు

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nml.co.in

News October 22, 2025

హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుకలు!

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నటి, ప్రియురాలైన శిరీషను ఈనెల 30న రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ, 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.

News October 22, 2025

UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

image

పండుగ సీజన్‌లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.