News April 24, 2024

ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా

image

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. సిద్దిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వెళ్లనున్నారు. ఆ తర్వాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్ వెళ్తారు.

Similar News

News January 10, 2026

HYD: ఫోన్ హ్యాక్ అయిందా.. ఇలా చేయండి!

image

సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CERT ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మెసేజెస్ పంపుతుంది. మీరు సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. బోట్నెట్ ఇన్ఫెక్షన్లు, మాల్వేర్ల నుంచి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి, CERT-In GoI https://www.csk.gov.inలో ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని HYD టీమ్ సూచించింది.

News January 10, 2026

నారావారిపల్లెలో చంద్రబాబు 4 రోజుల పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని 4రోజుల పాటు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. ఈ నెల 12న తిరుపతి(D) సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు హాజరవుతారు. రాత్రికి స్వగ్రామానికి చేరుకొని 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. 15న ఉండవల్లిలోని ఇంటికి తిరుగు పయనమవుతారు.

News January 10, 2026

ప్రెగ్నెన్సీలో ఈ సమస్య రాకుండా ఉండాలంటే?

image

సాధారణంగా కొంతమందిలో గర్భధారణ సమయంలో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఒకవేళ ఇంతకు ముందు లేకపోయినా కొంతమందిలో ఈ సమస్య ప్రెగ్నెన్సీ సమయంలో 4-5 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే ఈ సమస్య ఉందా లేదా అనేది చెక్‌ చేయించుకోవాలి. అందుకోసం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశముందంటున్నారు నిపుణులు.