News May 5, 2024
నేడు రాష్ట్రానికి అమిత్ షా

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. ఇక్కడ జరిగే సభలో అమిత్‌షాతో పాటు చంద్రబాబు కూడా పాల్గొంటారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. జమ్మలమడుగు, ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
Similar News
News January 7, 2026
ఒకే బెడ్రూమ్లో రెండు బెడ్లు ఉండవచ్చా?

ఒకే బెడ్రూమ్లో రెండు బెడ్లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 7, 2026
మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.
News January 7, 2026
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.


