News August 23, 2024
సురేశ్ గోపీ సినిమాల జాబితాను పక్కన పడేసిన అమిత్ షా

తాను అంగీకరించిన సినిమాల జాబితాను ఇస్తే అమిత్ షా అవతల పడేశారని కేంద్ర మంత్రి, త్రిసూర్ ఎంపీ సురేశ్ గోపీ అన్నారు. సినిమా తనకు ప్యాషన్ అని, నటించకపోతే చచ్చిపోతానని పేర్కొన్నారు. ఒట్టక్కొంబన్ చిత్రంలో నటించేందుకు అనుమతి ఇంకా రాలేదన్నారు. ‘ఎన్ని సినిమాలు పెండింగ్ ఉన్నాయని అడిగితే 20-22 అని అమిత్షాకు చెప్పా. ఆ పేపర్ను ఆయన పడేశారు. ఏదేమైనా పార్టీ నాయకత్వానికి విధేయుడిగా ఉండాల్సిందే’ అని ఆయన అన్నారు.
Similar News
News December 10, 2025
అన్నమయ్య: 16 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

అన్నమయ్య (D) వీరబల్లి మండలంలోని సోమవారం వడ్డిపల్లిలో దీపిక(16) మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికి 2పెళ్లిళ్లు కాగా దీపిక మొదటి భర్త కుమార్తె. రెండో వివాహం తర్వాత తల్లి పాపని కొన్నిరోజుల క్రితం వడ్డిపల్లికి తీసుకువచ్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలీదుగానీ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై వీరబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 10, 2025
క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News December 10, 2025
ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.


