News February 28, 2025
అమిత్ షా మీటింగ్: బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఏరివేతే అజెండా!

HM అమిత్ షా అధ్యక్షతన నేడు ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. CM రేఖాగుప్తా, MoH అధికారులు హాజరవుతారు. శాంతి భద్రతలు, అక్రమ వలసదారుల ఏరివేతే అజెండా అని తెలిసింది. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగ్లా దేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని దేశం నుంచి తరిమేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం. ఇప్పటికే పార్లమెంటులో ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించడం గమనార్హం.
Similar News
News November 4, 2025
అన్నీ పండించే కాపునకు అన్నమే కరవు

రైతులు తమ శ్రమతో దేశం మొత్తానికి కావాల్సిన పంటలు పండించి ఆహారాన్ని అందిస్తారు. కానీ కొన్నిసార్లు వారి సొంత కష్టాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకే సరైన తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల ఆకలి తీర్చే అన్నదాతలు తమ ప్రాథమిక అవసరాలకే కష్టపడటాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. రైతు కష్టానికి తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది.
News November 4, 2025
రైతులను హేళన చేస్తారా?.. కేంద్రమంత్రి ఆగ్రహం

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీమా సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. PM ఫసల్ బీమాకు సంబంధించిన ఫిర్యాదులను ఆయన సమీక్షించారు. పంటల బీమా కింద రైతులకు రూ.1, రూ.5, రూ.21 వంటి మొత్తాలు పరిహారంగా చెల్లించడాన్ని తప్పుబట్టారు. అది రైతులను, పథకాన్ని హేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం అనుమతించబోదని పేర్కొన్నారు.
News November 4, 2025
శబరిమల యాత్రికులకు రూ.6కోట్లతో ఆస్పత్రి

శబరిమల యాత్రికుల కోసం రూ.6.12కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆస్పత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీలక్కల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకూ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భూమి కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఎమర్జెన్సీ, ICU, ECG విభాగాలుంటాయని తెలిపారు.


