News January 18, 2025
నేడు రాష్ట్రానికి అమిత్ షా

AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 5, 2025
వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.
News December 5, 2025
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.


