News December 22, 2024
అమిత్ షాను పిచ్చి కుక్క కరిచింది: ప్రియాంక్

అంబేడ్కర్‌పై వివాదాస్పద <<14915470>>వ్యాఖ్యలు<<>> చేసిన అమిత్ షాపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆయనను పిచ్చి కుక్క కరవడంతోనే ఇలా మాట్లాడారని దుయ్యబట్టారు. ‘7 జన్మల్లో భగవంతుడిని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో తెలియదు. కానీ ఈ జన్మలో అంబేడ్కర్‌ను స్మరిస్తే రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం పొందుతాం. అంబేడ్కర్, సమానత్వం అనేవి షా ఆలోచనల్లో లేకపోవడమే అసలు సమస్య’ అని పేర్కొన్నారు.
Similar News
News September 22, 2025
రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
News September 21, 2025
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఫైర్

GSTకి సంబంధించి PM మోదీ <<17785063>>వ్యాఖ్యలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్ అమలు చేసిన సింపుల్ GSTకి బదులు మీ ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లలో 9 శ్లాబ్స్ పెట్టి రూ.55 లక్షల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు సేవింగ్స్ ఫెస్టివల్ అంటూ రూ.2.5 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద గాయాలకు చిన్న బ్యాండ్ ఎయిడ్ వేయాలని చూస్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
News September 21, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.