News November 29, 2024
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు విపత్తు నిర్వహణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఇందులో నిర్వచిస్తారు. మరోవైపు రాజ్యసభలో ఇంట్రడక్షన్‌కు 44, ఆమోదం కోసం 5 బిల్లులను ప్రవేశపెడతారు.
Similar News
News December 12, 2025
ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి
News December 12, 2025
9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్

AP: VSP ఎకనామిక్ రీజియన్‌పై CM CBN సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
News December 12, 2025
హైదరాబాద్‌లో అఖిలేశ్.. రేవంత్, కేటీఆర్‌తో భేటీ

TG: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ ఆయనకు వివరించారు. అటు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ సమావేశమైన అఖిలేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.


