News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.
Similar News
News October 9, 2025
వామన్‌రావు జంట హత్యకేసులో సీబీఐ దూకుడు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి జంట హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సాక్షులను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇవాళ వామన్‌రావు అనుచరులు సంతోశ్, సతీశ్‌ను విచారించింది. ఆయనతో వారి ప్రయాణం, సాన్నిహిత్యంపై ఆరా తీసింది. ఈ కేసులో గత 20 రోజులుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. మొత్తం 130 మందిని అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
News October 8, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును AICC ప్రకటించింది. ఇన్నిరోజులు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా అవకాశం మాత్రం నవీన్‌ను వరించింది. BRS పార్టీ ఇప్పటికే దివంగత MLA మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, MIMలు పోటీ నుంచి తప్పుకున్నాయి. BJP టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News October 8, 2025
పాక్ PMని ‘పెట్’తో పోల్చిన హర్ష్ గోయెంకా

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెటైరికల్‌గా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పుంగనూరు ఆవును, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు కుక్కలను పట్టుకున్న ఫొటోను ఆయన Xలో షేర్ చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కన మాత్రం పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఉన్నారు. దీనికి ‘గ్లోబల్ లీడర్లు అందరికీ వారి వారి ఫేవరెట్ పెట్స్ ఉన్నాయి’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.