News August 6, 2025
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం (2,258 రోజులు) కేంద్ర హోంమంత్రిగా పని చేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్.కె. అద్వానీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వాజ్‌పేయి హయాంలో అద్వానీ 2,256 రోజులపాటు హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.
Similar News
News August 6, 2025
‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారమా’?

ట్రంప్ వ్యవహార శైలి ‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం’ అన్న చందంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా రష్యా నుంచి $24.51 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లో $3 బిలియన్ల బిజినెస్ చేసింది. కానీ భారత్ ఆయిల్ దిగుమతి వల్లే రష్యాకు డబ్బులు వస్తున్నాయని, అందుకే యుద్ధం కొనసాగిస్తోందని ట్రంప్ చెబుతున్నారు.
News August 6, 2025
IPOకు టాటా క్యాపిటల్

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు టాటా సన్స్ ఆధ్వర్యంలోని టాటా క్యాపిటల్ సంస్థ సెబీ వద్ద డాక్యుమెంట్లు సమర్పించింది. IPOలో భాగంగా 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో 21 కోట్ల షేర్లను తాజాగా, మిగతా 26.58 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. ఈ IPO ద్వారా ₹17,400 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. SEBI వద్ద దాఖలు చేసిన డాక్యుమెంట్లలో సంస్థ విలువ ₹96,000crగా పేర్కొంది.
News August 6, 2025
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో ఎన్నికలు: యూనస్

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రకటించారు. రంజాన్‌కు ముందు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయని తెలిపారు. ఈ విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మధ్యంతర ప్రభుత్వం తరఫున లేఖ రాస్తానని పేర్కొన్నారు. నేటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతామన్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ ప్రకటనతో రెండు నెలల ముందే రానున్నాయి.