News April 2, 2024
రామ్ చరణ్ సినిమాలో అమితాబ్ బచ్చన్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో చరణ్‌కు అమితాబ్ తాతయ్యగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కథంతా తాతా-మనవడు రిలేషన్ షిప్ మధ్య నడుస్తుందని టాక్. బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.
Similar News
News October 29, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 29, 2025
తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
News October 29, 2025
రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు: క్లార్క్

ఇండియాకు రివర్స్‌గా ఉండే ఆస్ట్రేలియన్ కండిషన్లలోనూ రోహిత్ శర్మ బాగా ఆడుతారని AUS మాజీ ప్లేయర్ మైఖేల్ క్లార్క్ ప్రశంసించారు. హిట్ మ్యాన్ ఆడే విధానం తనకు నచ్చుతుందని తెలిపారు. ‘వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు. నేను కలిసి ఆడిన బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్లలో అతను ఒకడు. కోహ్లీ అద్భుతమైన వన్డే క్రికెటర్. ప్రస్తుత ఫామ్ కొనసాగితే 2027 WCలోనూ వీరు ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.


