News April 20, 2024
‘కల్కి’ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే పోస్టర్‌లో రేపు రాత్రి 7.15 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News March 27, 2026
పీరియడ్స్ ఆలస్యం.. ‘మార్చి’ని నిందిస్తున్న అమ్మాయిలు!

ఈ నెలలో తమ పీరియడ్స్ <<19484301>>ఆలస్యం<<>> అవుతున్నాయని, ‘మార్చి మంచిది కాదు’ అంటూ కొంతమంది అమ్మాయిలు SMలో పోస్టులు పెడుతున్నారు. కానీ అదంతా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. FEBలో 28 రోజులే ఉండటం, MARలో వాతావరణం, సూర్యరశ్మిలో మార్పు వంటి సైంటిఫిక్ రీజన్స్ హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. MARలోనే పరీక్షలు, రొటీన్ జాబ్ షిఫ్టుల స్ట్రెస్, ట్రావెల్ షెడ్యూల్సూ ఆలస్యానికి కారణమట.
News March 27, 2026
BREAKING: సీఎంలతో ప్రధాని వర్చువల్ మీటింగ్ స్టార్ట్

సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంపై దాని ప్రభావం, అనుసరించాల్సిన విధివిధానాలపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎస్‌లతో కేంద్రం విడిగా సమావేశం కానుంది. ఇక ఈ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.
News March 27, 2026
S-400 సహా రక్షణ కొనుగోళ్లకు ₹2.38 లక్షల కోట్లు

భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.38 లక్షల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ఆమోదం తెలిపింది. రవాణా విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘S-400’, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ వ్యవస్థలు, రిమోట్‌తో నడిచే స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్టులు, ధనుష్ గన్ సిస్టమ్, ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను సేకరించనుంది.


