News May 24, 2024
అమీతుమీ.. ఇంటికా.. ఫైనల్‌కా?

క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేదో నేడు తేలనుంది. చెపాక్ వేదికగా ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్‌లో RR, SRH అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్లు బలంగా కనిపిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10, రాజస్థాన్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నెగ్గింది.
Similar News
News December 3, 2025
యలమంచిలి: జిల్లా ఎక్సైజ్ అధికారిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు.. విచారణ

అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి వి.సుధీర్‌పై యలమంచిలికి చెందిన మద్యం వ్యాపారులు లాలం కార్తీక్, కర్రి మహాలక్ష్మీనాయుడు, లాలం శేఖర్ రాష్ట్ర ఎక్సైజ్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. యలమంచిలి పరిధిలో ఒక బార్ లైసెన్స్ కోసం ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.26 లక్షలకు పైగా అక్రమంగా బలవంతపు వసూళ్లు చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
News December 3, 2025
ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.


