News May 12, 2024
వెండితెరపై ‘అమ్మ ప్రేమ’ ప్రత్యేకం

అమ్మ అనే పిలుపు లేకుండా మన రోజు గడవదు. సినిమాల్లోనూ అమ్మ పాత్రను దర్శకులు ప్రత్యేకంగా నిలిపారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ సహా ఎన్నో సినిమాలు తల్లి ప్రేమతో ముడిపడినవే. ఒకే ఒక జీవితం, అమ్మ చెప్పింది, బిచ్చగాడు, ఛత్రపతి, యోగి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నానీ, యమలీల, మాతృదేవోభవ, అమ్మ రాజీనామా వంటి చిత్రాలు మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కి హిట్టయ్యాయి.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Similar News
News November 25, 2025
కొత్తగా పెద్దహరివనం మండలం!

ఆదోని మండల పునర్విభజన ఖాయమైంది. కొత్తగా పెద్దహరివనం మండలం ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు నేడు మరోసారి మంత్రులు, అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం 42 గ్రామాలతో ఒకే మండలంగా ఆదోని నియోజకవర్గం ఉంది. దీనిని 4 మండలాలుగా విభజించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.


