News July 8, 2024
అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను: మంచు మనోజ్

పిల్లలపై <<13581564>>అసభ్యకర<<>> కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్పై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ‘అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను’ అని వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందన్నారు. చైల్డ్ సేఫ్టీపై ఏడాది క్రితం ఓ వ్యక్తిని ఇన్స్టాలో సంప్రదించానని, అప్పుడు స్పందించని అతడు ఇప్పుడు పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడన్నారు.
Similar News
News December 4, 2025
కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.


