News March 12, 2025
AMP: ఉద్యోగులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి

ప్రజలను సంతృప్తి పరిచే విధంగా భూ పరిపాలన రీ సర్వే అంశాలలో ఉద్యోగులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
Similar News
News March 23, 2025
NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!
News March 23, 2025
కుబీర్: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందిన ఘటన కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. పార్డి(బి) గ్రామానికి చెందిన RMP వైద్యుడు పోతన్న రోజులాగే గ్రామంలో వైద్యం అందించి ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలాడు. గమనించిన ఆయన తల్లి, స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.
News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల(50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.