News April 2, 2025

AMP: ఉపరితల ఆవర్తనం..నేడు వర్షాలు పడే అవకాశం

image

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 4, 2025

మేడ్చల్: ‘పాలిటెక్నిక్ వాళ్లకు అగ్నివీర్ అవగాహన’

image

మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఆర్మీ మిలిటరీ బృందం అగ్నివీర్ రిక్రూట్మెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాల గురించి అవగాహన కల్పించారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ పోస్టర్ విడుదల చేసిన ఆర్మీ అధికారులు, చిన్నతనంలోనే దేశం కోసం సేవ చేసేందుకు అద్భుత అవకాశం ఉందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2025

రజినీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్!

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘కూలీ ఫ్రమ్ ఆగస్టు 14’ అన్న హాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

News April 4, 2025

నిడదవోలు నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఈ నెల 6న భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!