News February 3, 2025
AMP: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజిఆర్ఎస్ రద్దు

గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్ జరగదని ప్రజలు గమనించాలన్నారు.
Similar News
News October 15, 2025
గూగుల్తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.
News October 15, 2025
జనవరి నాటికి కోటి మందికి భూధార్ కార్డులు

TG: భూధార్ కార్డులను త్వరలోనే అందించనున్నారు. జనవరి నాటికి కోటి మంది రైతులకు భూధార్ అందించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేలా కేంద్రం భూధార్ తీసుకొచ్చింది. సర్వే రికార్డు, RORలోని వివరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక భూధార్ కార్డులు ఇచ్చి, రీ సర్వే చేశాక శాశ్వత కార్డులు ఇస్తామని భూభారతి చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
News October 15, 2025
రౌడీషీటర్ నవీన్రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.