News February 3, 2025
AMP: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజిఆర్ఎస్ రద్దు

గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్ జరగదని ప్రజలు గమనించాలన్నారు.
Similar News
News February 18, 2025
బెల్లంపల్లి నుంచి నెన్నెలకు పయనమైన పెద్దపులి

బెల్లంపల్లి అటవీ రేంజ్‌లో 15 రోజులుగా సంచరించిన పెద్దపులి కృశ్నపల్లి రేంజ్‌లోకి ప్రవేశించి తాజాగా నీల్వాయి రేంజ్ పరిధి నెన్నెల మండలంలో సంచరిస్తున్నట్లు డిప్యూటీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడించారు. మండలంలోని ఆవిడం గ్రామం పొట్యాల్ అటవీ శివారులో మంగళవారం పులి పాదముద్రలను గుర్తించామన్నారు. కాగా బెల్లంపల్లిలో అడవి పందిని హతమార్చిన పులి ఇప్పటివరకు వేరే జంతువులను చంపిన ఆనవాళ్లు గుర్తించలేదన్నారు.
News February 18, 2025
తక్కువ ధరకే ‘iPHONE 16 PRO MAX’.. ఎక్కడంటే?

యాపిల్ నుంచి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కొనేందుకు జనం ఎగబడుతుంటారు. ప్రస్తుతం iPHONE 16 PRO MAX కాస్ట్లీయస్ట్. దీని ధరలు దేశాలను బట్టి మారుతుంటాయి. అయితే అతి తక్కువగా అమెరికాలో లభిస్తుంది. USలో కేవలం రూ.1.04లక్షలకే పొందొచ్చు. ఇక కెనడా & జపాన్‌లో రూ.1.07లక్షలు, హాంకాంగ్‌లో రూ.1.13 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.18 లక్షలు, చైనా& వియత్నాంలో రూ.1.19 లక్షలు, UAEలో రూ.1.20 లక్షలు, INDలో రూ.1.37 లక్షలుగా ఉంది.
News February 18, 2025
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసరు. ప్రయాణికుడిని అమీర్ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు.