News February 10, 2025

AMP: కేంద్రీయ విద్యాలయం పనులు వేగవంతం చేయాలి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో సహా, రాష్ట్రంలో వివిధ విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించేందుకు, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఢిల్లీలో  ఎంపీ హరీష్ మాధుర్ కలిశారు. కోనసీమ జిల్లాలో కేటాయించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రికి సూచించారు. తక్షణమే జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

Similar News

News March 19, 2025

VKB: పదో తరగతి పరీక్షలు… కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదన్నారు. తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

News March 19, 2025

IPL: మిడిలార్డర్‌లో KL బ్యాటింగ్?

image

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్‌లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.

News March 19, 2025

కామారెడ్డి: లేఅవుట్ ప్లాట్ల అనుమతులపై నివేదికలు సమర్పించాలి: కలెక్టర్

image

లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు సంబంధిత శాఖల అధికారులు నివేదికలు స్పష్టంగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో TG బి -పాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు ఆయా శాఖల అధికారుల నివేదికలను సమర్పించాలన్నారు. ఆయా లే అవుట్లు సంబంధిత అధికారులు పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలన్నారు.

error: Content is protected !!