News February 10, 2025

AMP: గీత కార్మికుల మద్యం షాపుల టెండర్ల వాయిదా

image

అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవనంలో 10వ తేదిన గీత కార్మికుల మద్యం షాపుల ఎంపిక కోసం జరగవలసిన లాటరీ వాయిదా పడిందని అమలాపురం ఎక్సైజ్‌ సూపర్డెంట్‌ ఎస్‌కేడీవీప్రసాద్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలక్షన్‌ కమిషన్‌‌కు ఈ విషయాన్ని తెలిపి అనుమతి కోరమన్నారు. అనంతరం కోర్టు నుంచి అనుమతి రాగానే షాపుల టెండర్లు తెరుస్తామన్నారు. 13 మద్యం షాపులకు గాను 261 టెండర్లు వచ్చాయని ప్రసాద్‌ తెలిపారు.

Similar News

News September 16, 2025

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

image

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News September 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 16, 2025

VZM: మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు వ‌రం

image

మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు స్వ‌స్త్ నారీ స‌శ‌క్తి ప‌రివార్ అభియాన్ ప‌థ‌కం ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వన్ అన్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి గోడ ప‌త్రిక‌ను ఆయ‌న క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం ఆవిష్క‌రించారు. దీని ద్వారా వివిధ ర‌కాల స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన‌వారికి త‌గిన వైద్య స‌దుపాయాన్ని అందించాల‌ని సూచించారు.