News March 3, 2025
AMP: డాక్టర్ శర్మకు కలెక్టర్ అభినందనలు

56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్‌లో క్షయ వ్యాధి నివారణ కోసం 12 మంది సభ్యులతో ఉప సంఘం ఏర్పాటు చేశారు. భారతదేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేశారు. వారిలో జిల్లా నుంచి డాక్టర్ పీఎస్ శర్మ సభ్యులుగా ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురంలో క్షయ వ్యాధి అపోహ నివారణపై ముద్రించిన ముద్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్మను అభినందించారు.
Similar News
News December 14, 2025
తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్‌లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.
News December 14, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 93.11 శాతం నమోదవగా అత్యల్పంగా రామన్నపేట మండలంలో 90.58 శాతం నమోదైంది. భువనగిరి మండలంలో 93.08 శాతం, బీబీనగర్ మండలంలో 91.38 శాతం, వలిగొండ మండలంలో 91.24 శాతం నమోదైంది. మొత్తం 2,02,716 ఓట్లకు 1,85,937 ఓట్లు పోల్ అయ్యాయి.
News December 14, 2025
మెదక్ జిల్లాలో రెండో విడతలో 88.80% పోలింగ్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 88.80 శాతం నమోదైంది. మొత్తం 1,72,656 ఓటర్లలో 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి.


