News February 23, 2025
AMP: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.
Similar News
News November 27, 2025
HYD: సమయానికి MMTS రైల్వే సర్వీసులు

HYDలోని లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న MMTS రైల్వే సర్వీసులు సమయానికి అందుబాటులో ఉంటున్నాయని SCR రైల్వే అధికారులు తెలిపారు. 9 6% సమయపాలన పాటిస్తున్నట్లుగా రికార్డులో తెలిసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తూనే, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.
News November 27, 2025
ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్: ఎండీ

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్మిషన్లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.


