News April 8, 2025

AMP: బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

image

అమలాపురం కొంకాపల్లిలో చెందిన 9ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కేసును అమలాపురం పట్టణ పోలీసులు సీసీ టీవీ కెమెరాల సహాయంతో ఛేదించారు. అమలాపురం పట్టణ పరిధిలోని కొంకాపల్లికి చెందిన 9ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కేసును పట్టణ పోలీసులు త్వరితగతిన విచారణ చేయగా కిడ్నాప్‌ ఓ డ్రామాని పోలీసులు నిర్ధారించారు. బాలిక ఒంటరిగా నడిచి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ డ్రామాకు వివరాలను సీ.ఐ. వీరబాబు తెలిపారు.

Similar News

News December 3, 2025

ఖమ్మం: అయ్యప్ప భక్తులకు శుభవార్త

image

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నెల (డిసెంబర్) 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్‌ను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.

News December 3, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.

News December 3, 2025

హన్మకొండ: 66 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్

image

జిల్లాలో ఈసారి జరగబోయే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దశల్లో పోలింగ్ జరగనున్న మొత్తం 1986 పోలింగ్ స్టేషన్లలో (PS) దాదాపు 586 స్టేషన్లను వెబ్ కాస్టింగ్ కోసం ఎంపిక చేశారు.
దశ-I: 166 (658 PS)
దశ-II: 208 PS (694 PS)
దశ-III: 212 PS (634 PS) కేంద్రాల్లో పర్యవేక్షణ కోసం 66 మైక్రో అబ్జర్వర్లను నియమించారు.