News February 22, 2025

AMP: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

image

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథం ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

image

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

News December 17, 2025

అప్పయ్యపల్లి సర్పంచ్‌గా సుప్రియ

image

HNK జిల్లా శాయంపేట మండలం అప్పయ్యపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ వినయ్ కుమార్ ఘన విజయం సాధించారు. అప్పయ్యపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచ్‌గా సుప్రియ ఎన్నికవడంతో వారి మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు.

News December 17, 2025

మేకప్ రోజంతా ఉండాలంటే ఇలా చేయండి

image

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి, టోనర్‌ అప్లై చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఆపై ప్రైమర్ ఉపయోగించాలి. జిడ్డు చర్మం వారు మ్యాటిఫైయింగ్ ఫార్ములాను, చర్మం పొడిగా అనిపిస్తే హైడ్రేటింగ్ ప్రైమర్‌ను వాడాలి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకొని మేకప్ సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోయే మేకప్ మీ సొంతం అవుతుంది.