News February 11, 2025
AMP: భూములకు సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాలువలు, డ్రైన్లు కు అవసరమైన చోట్ల క్రాస్ బండ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి తాసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News October 24, 2025
MDK: బంగారంపై చిగురిస్తున్న ఆశలు..!

కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరిగి ఆకాశాన్ని అంటాయి. రెండు రోజుల క్రితం బంగారం ధర రూ.1,33,000 ఉండగా ప్రస్తుతం ఒక్క రోజే రూ.5 వేలు తగ్గింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులు బంగారం ధర తగ్గాలని ఎదురుచూస్తుండగా రూ.5 వేలు తగ్గడంతో కొంత వరకైనా మేలని అంటున్నారు.
News October 24, 2025
ట్రెండ్ Shift: బ్రాండ్ కాదు! మ్యాటర్ ఉందా? లేదా?

IIT, IIMలలో చదివినోళ్లకే కంపెనీల రెడ్ కార్పెట్ అనే ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం టైర్-3 కాలేజ్ గ్రాడ్యుయేట్లనూ కంపెనీలు సెలక్ట్ చేసుకుంటున్నాయని కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ సర్వేలో వెల్లడైంది. యాపిల్, NVIDIA, SAP, పేపాల్, జోహో వంటి సంస్థల్లో 1/3 ఎంప్లాయిస్ సాధారణ కాలేజీల్లో చదివిన వారేనట. బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ మొదట్లో జాబ్ పొందడంలో వాల్యూ యాడ్ చేస్తున్నా ఆ తర్వాత టాలెంట్ ఆధారంగా గ్రోత్ ఉంటోంది.
News October 24, 2025
కేయూ పరిశోధకురాలు చైతన్య కుమారికి డాక్టరేట్

కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ పరిశోధకురాలు కె.చైతన్య కుమారి డాక్టరేట్ పొందారు. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ప్రకటించారు. ఆచార్య వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో ఆమె “Public Policy and Tribal Welfare: A Study of ITDA Programs in Kumram Bheem Asifabad District” అంశంపై పరిశోధన పూర్తి చేశారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఆమెను అధ్యాపకులు అభినందించారు.


