News April 7, 2025

AMP: ముగిసిన విశాఖ విద్యా యాత్ర

image

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థుల విద్యా విజ్ఞానానికి దోహదపడేలా మూడు రోజుల విశాఖ విద్యా యాత్ర ఆదివారంతో ముగిసిందని డీఈఓ డాక్టర్ సలీం భాషా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు యానాం బొటానికల్ గార్డెన్, ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమ, రుషికొండ బీచ్ , తొట్లకొండ బౌద్ధారామాలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్ తదితర ప్రాంతాలు సందర్శించారన్నారు. జిల్లా సైన్స్ అధికారి జీవివి సుబ్రహ్మణ్యం ఉన్నారు.

Similar News

News December 17, 2025

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతనే.!

image

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఎన్.ఎం.డీ ఫిరోజ్ నియమితులయ్యారు. ఆయన మూడో సారి ఈ పదవిని చేపట్టారని నాయకులు తెలిపారు. అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ వేశారు. అయితే ఆ పదవి ధర్మవరం సుబ్బారెడ్డికి వెళ్లడంతో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

News December 17, 2025

MHBD: 11 గంటలకు 66.24 శాతం ఓటింగ్

image

MHBD జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి
డోర్నకల్- 70.15శాతం, గంగారాం-69.97 శాతం, కొత్తగూడ-58.64 శాతం, కురవి -62.77, సీరోల్ -70.00,
మరిపెడ- 68.42 శాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 66.24 ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

పవన్, లోకేశ్‌లపై చంద్రబాబు ప్రశంసలు.. కలెక్టర్లకు దిశానిర్దేశం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ, డేటా ఆధారిత పాలన సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. కానిస్టేబుల్ కోరిక మేరకు అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేయడాన్ని గుర్తుచేశారు. అలాగే వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన మంత్రి లోకేశ్‌ను అభినందించారు.