News April 10, 2025
AMP: రైల్వే లైన్‌పై ఆర్డీవోలతో ఎంపీ హరీష్ సమీక్ష

కోటిపల్లి రైల్వే లైన్ భూసేకరణపై అంబేడ్కర్ కోనసీమలోని ఆర్టీవోతో ఎంపీ హరీష్ మాధుర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అమలాపురం ఆర్డీవో మాధవి, కొత్తపేట ఆర్డీవో శ్రీకర్‌లతో చర్చించారు. కోనసీమ రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించి గత సమీక్ష సమావేశం తర్వాత జరిగిన పురోగతిపై ఆర్డీవోలు ఎంపీకి వివరించారు. తదుపరి కార్యాచరణ ప్రణాళిక, త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.
Similar News
News January 2, 2026
ములుగు: ‘మావో’ దేవా లొంగుబాటు నిజమేనా!

మావోయిస్టు అగ్రనేత పువ్వర్తికి చెందిన బార్సే దేవా తన సహచరులతో లొంగిపోయినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చర్చ నడుస్తోంది. అయితే, దేవా బెటాలియన్ నెంబర్-1 కమాండర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాడని, తనతో ఉన్న సుమారు 40 మంది క్యాడర్‌తో ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కాగా, అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
News January 2, 2026
Grok వ్యక్తి ప్రాణాలు కాపాడింది: మస్క్

నార్వేకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను X చాట్‌బోట్ Grok కాపాడింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడికి వైద్యులు సాధారణ గ్యాస్ సమస్యగా భావించి మందులిచ్చారు. అయినా తగ్గకపోవడంతో తన సమస్యను గ్రోక్‌కు వివరించగా అది అపెండిక్స్ లేదా అల్సర్ కావచ్చని CT స్కాన్ చేయించుకోవాలని సూచించింది. టెస్టులో అపెండిక్స్ పగిలే దశలో ఉన్నట్లు తేలడంతో వైద్యులు సర్జరీ చేసి కాపాడారు. ఈ విషయాన్ని మస్క్ వెల్లడించారు.
News January 2, 2026
GNT: డిసెంబర్ 31న రూ.18.68 కోట్ల మద్యం విక్రయం

2025కు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అట్టహాసంగా చేశారు. DEC నెల మొత్తం గుంటూరు జిల్లాలో రూ. 254.51కోట్లు, పల్నాడులో 105.12 కుట్లు అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. చివరి 10 రోజుల్లో గుంటూరు జిల్లాలో రూ. 71.37 కోట్లు, పల్నాడు జిల్లాలో రూ. 42.96 కోట్లు వ్యాపారం జరిగిందన్నారు. 31వ తేదీన గుంటూరు జిల్లాలో రూ.12.96 కోట్లు, పల్నాడు రూ. 5.72 కోట్లు జరిగింది.


