News April 19, 2025
AMP: ‘ఈనెల 30లోపు E-KYC నమోదు చేసుకోవాలి’

కోనసీమ జిల్లాలోని ప్రతి రేషన్ కార్డుదారుడు E-KYC ఈ నెలాఖరునాటికి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ కోరారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడు తమకు వచ్చే బియ్యం పంపిణీ ఆగిపోకుండా ఉండాలంటే రేషన్ కార్డుదారులు E-KYCని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. E-KYC స్టేటస్ ఆన్‌లైన్, రేషన్ వాహనాలు వద్ద నమోదు చేయాలన్నారు.
Similar News
News January 11, 2026
సర్వీస్ ఛార్జ్ వేస్తే రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయండి

రెస్టారెంట్స్/బార్స్ కస్టమర్‌కు డీఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్‌తో బిల్ ఇవ్వడం నేరం. వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం.. SCతో బిల్ ఇవ్వడం, మరో పేరుతో ఛార్జ్, తప్పక ఇవ్వాలనడం తదితరాలు చట్ట విరుద్ధం. సేవలు నచ్చి కస్టమర్ స్వతహాగా ఇస్తే తీసుకోవచ్చు కానీ డిమాండ్ చేయకూడదు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ 1915కు ఫిర్యాదు చేస్తే, విచారించి రెస్టారెంట్లకు ₹50K వరకు ఫైన్ విధిస్తుంది.
Share It
News January 11, 2026
రేపు మదనపల్లిలో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక DSP కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు.
News January 11, 2026
కృష్ణా: కోడి పందేలలో గోదావరి జిల్లాలను తలదన్నేలా.?

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు.. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. అయితే గత కొన్నేళ్లు గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కృష్ణా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గన్నవరం మండలం అంబాపురం, గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతిపెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు.


