News April 2, 2025

AMP: ఉపరితల ఆవర్తనం..నేడు వర్షాలు పడే అవకాశం

image

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 3, 2025

భూపాలపల్లి ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల అమ్మకాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం HYD వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను పూర్తిగా ఖండించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. 

News April 3, 2025

మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

image

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.

News April 3, 2025

సత్యవేడు MLAపై TDP అధిష్ఠానానికి ఫిర్యాదు

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తమను అణగదొక్కుతున్నారని వాపోయారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తేనే అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే హేమలతకు సత్యవేడు బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరినట్లు సమాచారం.

error: Content is protected !!