News February 10, 2025
AMP: కేంద్రీయ విద్యాలయం పనులు వేగవంతం చేయాలి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో సహా, రాష్ట్రంలో వివిధ విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించేందుకు, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఢిల్లీలో ఎంపీ హరీష్ మాధుర్ కలిశారు. కోనసీమ జిల్లాలో కేటాయించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రికి సూచించారు. తక్షణమే జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
Similar News
News October 30, 2025
GWL: ‘నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి’

గద్వాలలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.130 కోట్లతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.
News October 30, 2025
బెల్లంపల్లి ఏరియాలో సీఎంఓ పర్యటన

బెల్లంపల్లి ఏరియా గోలేటి, మాదారం చీఫ్ మెడికల్ అధికారి కిరణ్ రాజు గురువారం పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో వసతులు, ల్యాబ్‌లను తనిఖీ చేశారు. నిత్యం ఎంత మంది ఉద్యోగులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. పునరావాస కాలనీల్లో మొబైల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందించే వైద్య సేవలను కొనసాగించాలని పేర్కొన్నారు.
News October 30, 2025
రాయికల్: ‘రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు’

జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్, సింగారావుపేట, జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామాల్లోని ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


