News January 31, 2025

AMP: కోనసీమలో 64,327 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు

image

ఉమ్మడి ఉ.గో. జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న పోలింగ్ జరుగుతుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు బరిలో ఉన్నారు. కోనసీమలో 64,327 మంది ఓటర్లలో పురుషులు 37,069 మంది, మహిళలు 27,256 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

Similar News

News November 8, 2025

కొండాపూర్ శివారులో రోడ్డుప్రమాదం.. ఆటోడ్రైవర్ మృతి

image

మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అనుమల్ల గంగాధర్(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 4న గంగాధర్ భీమారం నుంచి కొండాపూర్ వైపు ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన గంగాధర్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కేసు నమోదైంది.

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.

News November 8, 2025

మెదక్: దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు

image

టేక్మాల్ మండలం వేల్పుగొండలో తల్లిని కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తల్లి సత్యమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్న అతడు కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.