News February 11, 2025

AMP: భూములకు సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

image

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాలువలు, డ్రైన్లు కు అవసరమైన చోట్ల క్రాస్ బండ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి తాసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News November 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 8, 2025

త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.

News November 8, 2025

నేడు ములుగు జిల్లాలో కరెంట్ కట్

image

మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉ.10 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కరెంట్ ఉండదని డీఈ నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రామచంద్రపూర్, కాటాపూర్, వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, మల్లూరు, కమలాపూర్, రాజుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, ధర్మారం, నూగూరు, వెంకటాపురం సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.