News April 2, 2025
AMP: సమర్థవంతంగా పది పబ్లీక్ పరీక్షలను నిర్వహించాం

కోనసీమ జిల్లాలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అత్యంత సమర్థవంతంగా 10వతరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా అన్నారు. ఆయన అమలాపురంలో మంగళవారం 10వ తరగతి పరీక్షలు పూర్తయిన సందర్భంగా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా స్థాయి పరీక్షల పరిశీలకులు మువ్వ రామలింగం ముఖ్య పాత్ర వహించారన్నారు.
Similar News
News November 5, 2025
రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరిన స్టార్ క్రికెటర్

T20 WC ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు స్టార్ బ్యాటర్ షాన్ విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాంబ్వే క్రికెట్ ప్రకటించింది. యాంటీ డోపింగ్, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయట్లేదని తెలిపింది. అతను డ్రగ్ అడిక్షన్‌తో ఇబ్బంది పడుతూ రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. విలియమ్స్ అన్ని ఫార్మాట్లలో కలిపి 56 హాఫ్ సెంచరీలు, 14 శతకాలు సహా 8968 రన్స్ చేశారు.
News November 5, 2025
కర్నూలు కలెక్టరే టీచర్

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
ఆయిల్‌పామ్ సాగులో వేగం పెంచాలి: కలెక్టర్ హైమావతి

ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో వేగం పెంచాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. వరి కోతలు పూర్తవుతున్నందున రైతులను కలిసి ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులకు సూచించారు. ఎల్లమ్మ చెరువు రోడ్డు, సుందరీకరణ పనులను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలన్నారు.


