News April 2, 2025

AMP: ఉపరితల ఆవర్తనం..నేడు వర్షాలు పడే అవకాశం

image

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 4, 2025

నారాయణపురం మండలంలో అత్యధిక వర్షపాతం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం సాయంత్రం నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా నారాయణపురం మండలంలో 97.8 MM, అత్యల్పంగా ఆలేరు మండలం గొలనుకొండలో 1.3MM నమోదైంది. తుర్కపల్లి 82.5MM, చౌటుప్పల్ 50.5 MM, బీబీనగర్ 48.5MM, ఆత్మకూర్ 44.5MM, గుండాల 37.5MM, పోచంపల్లి 30.0MM, మోత్కూర్ 13.5MM, రాజాపేట 13.3MM, భువనగిరి 9.0MM వర్షపాతం నమోదైంది.

News April 4, 2025

WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

image

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్మెన్ పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదో తరగతి పాస్) ఉత్తీర్ణత ఉండాలన్నారు. #SHARE IT.

News April 4, 2025

నిర్మల్‌లో మహిళ సూసైడ్

image

ఆచూకీ తెలియని ఓ మహిళ నిర్మల్ పట్టణంలోని నటరాజ్ చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో శవాన్ని బయటకు తీయించామని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!