News September 21, 2024

పొట్టి డ్రెస్సులో అమృత ప్రణయ్.. భిన్నాభిప్రాయాలు

image

మిర్యాలగూడ పరువు హత్య బాధితురాలు అమృత ప్రణయ్ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆమె ప్రమోషన్స్, ఫ్యాషన్ వ్లాగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోకాళ్లపైకి ఉన్న పొట్టి డ్రెస్సు ఫొటో వైరలవుతోంది. ‘భర్త చనిపోయిన అమ్మాయికి ఇలాంటి డ్రెస్స్‌లు అవసరమా?’ అని కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొందరేమో ‘ఆమెకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి’ అని వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?

Similar News

News December 4, 2025

పోలీసుల ‘స్పందన’ లేక..

image

ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ కుమార్తె <<18465236>>స్పందన<<>> (17) బలవన్మరణానికి పాల్పడి మరణించిందని తల్లిదండ్రులు వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై తాము ఫిర్యాదు చేస్తే చెన్నేకొత్తపల్లి పోలీసులు పట్టించుకోలేదని, వారు సక్రమంగా వ్యవహరించి ఉంటే తమ బిడ్డను కోల్పోయేవారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు కడపుకోత మిగిలిందని బోరున విలపించారు.

News December 4, 2025

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.