News October 18, 2025

బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

image

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్‌ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.

Similar News

News October 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

image

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>

News October 18, 2025

పెళ్లి చేసుకున్న ‘దంగల్’ నటి

image

‘దంగల్’ సినిమా ఫేమ్ జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘దంగల్‌’ మూవీలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె బాలీవుడ్‌లో ‘సీక్రెట్ సూపర్ స్టార్, ది స్కై ఈజ్ పింక్’ వంటి సినిమాల్లో నటించారు. మత విశ్వాసాల కారణంగా 2019లో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

News October 18, 2025

అఫ్గాన్‌‌‌ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

image

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.