News October 23, 2024
ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!

ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్‌కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్‌కి ఆఫీస్‌కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది.
Similar News
News March 10, 2026
వార్ విజువల్స్ షేర్ చేస్తే జైలుకే!

సౌదీలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏపీలోని మదనపల్లెకు చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. అటు ఖతర్‌లోనూ యుద్ధానికి సంబంధించిన వీడియోలు తీశారని, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారని 313 మందిని అరెస్ట్ చేశారు. UAEలోనూ వార్ విజువల్స్ రికార్డు/షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. 1-2 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.
News March 10, 2026
ఆయిల్ సప్లైని ఆపేస్తే… ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ సప్లైని నిలిపివేసేందుకు యత్నిస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల కంటే 20 రెట్ల బలంతో విరుచుకుపడతామని స్పష్టం చేశారు. తిరిగి కోలుకోలేని స్థాయిలో ఇన్‌ఫ్రాను ధ్వంసం చేస్తామన్నారు. అయితే అలాంటి పరిస్థితి రాబోదని ఆశిస్తున్నానన్నారు. చైనా సహా హార్ముజ్‌పై ఆధారపడిన దేశాలకు తానిచ్చే గిఫ్ట్ ఇదేనని వ్యాఖ్యానించారు.
News March 10, 2026
యుద్ధ భయం.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.


