News May 19, 2024

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం!

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాతావరణ పరిస్థితులే ఈ ఘటనకు కారణమని తెలిపాయి. రైసీ అచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్‌పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్‌తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్‌ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.

News December 4, 2025

2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 4, 2025

భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్‌లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. LLB/LLM ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో ఏడాదికి రూ.11లక్షలు, ట్రైనింగ్ తర్వాత రూ.22.50లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.powergrid.in