News April 4, 2025

ఇంటిమేట్ సీన్‌లో ఓ నటుడు హద్దు మీరాడు: హీరోయిన్ అనుప్రియ

image

తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ అనుప్రియా గోయెంకా పంచుకున్నారు. ఓ ముద్దు సీన్‌లో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. ‘ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్నా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్‌లో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా’ అంటూ చెప్పుకొచ్చారు.

Similar News

News January 21, 2026

సునీతా విలియమ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీలకు 1965 సెప్టెంబర్‌ 19న ఒహాయోలో సునీత జన్మించారు. 1998లో నాసాలో చేరిన ఆమె మొత్తం మూడుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్‌ చేశారు.

News January 21, 2026

173 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(<>UCO<<>>)లో 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా(ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రేడ్ ఫైనాన్స్), IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(cs) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in

News January 21, 2026

నన్ను చంపాలని చూస్తే ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్

image

తనను చంపేందుకు ఇరాన్ యత్నిస్తే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చా. నాపై హత్యాయత్నం జరిగి, అందులో ఇరాన్ హస్తం ఉందని తేలితే ఆ దేశాన్ని భూమిపై నుంచి తుడిచేయాలని చెప్పా’ అని అన్నారు. మరోవైపు దురాక్రమణకు చేయి చాపితే ఆ చేతిని నరికేస్తామని ట్రంప్‌కు తెలుసని, వాళ్ల ప్రపంచాన్ని తగలబెట్టేస్తామని ఇరాన్ భద్రతా దళాల ప్రతినిధి హెచ్చరించారు.